🌟 Team TDP – ఒకే లక్ష్యం, ఒకే ఆశయం

🔰 Team TDP ఎందుకు?

ప్రజాప్రతినిధి వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి
భావ స్వేచ్ఛ హరించబడుతోంది
అభివృద్ధి అడుగుల వెనుకబడింది

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అవసరం. అదే లక్ష్యంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని, దూరదృష్టిని గుర్తించిన కొంతమంది ఒకటైన మనసుతో Team TDP అనే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు.

🛡️ Team TDP లక్ష్యం

పసుపు సైన్యం తయారు చేయడం మా ముఖ్యమైన ధ్యేయం – ఇది రాజకీయ ఆశయంతో కాదు, ప్రజల పట్ల బాధ్యతతో కూడిన లక్ష్యం.

  • ప్రతి నియోజకవర్గం/మండలంలో నిజమైన TDP కార్యకర్తలను గుర్తించి కలుపుకోవడం
  • ప్రతి గ్రామం, వార్డు, బూత్ వరకు నిజంగా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలను ఆనుకోడం
  • సమాజంలో చైతన్యం తేనికి పసుపు సైన్యం తీర్చిదిద్దడం

🔗 Team TDP నిర్మాణం ఎలా ఉంది?

మొదటి అడుగుగా Team TDP (తెలంగాణ) మరియు Team TDP (ఆంధ్ర) అనే రెండు ప్రధాన WhatsApp గ్రూపులు ఏర్పాటుచేశాం. అక్కడినుండి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయికి విస్తరించి, ప్రతి మండలానికి 20 మంది నిజమైన కార్యకర్తలను ఎంపిక చేసి, వారి సహజ ప్రతిభను గుర్తించి శిక్షణతో కూడిన పసుపు సైనికులుగా తీర్చిదిద్దే పని Team TDP చేస్తోంది.

✊ Team TDP సంకల్పం

Team TDP అనేది పార్టీలో ఒక అధికారిక విభాగం కాదు. ఇది పార్టీ పట్ల ప్రేమతో, చంద్రబాబు గారి పట్ల గౌరవంతో ఏర్పడిన స్వచ్ఛంద కార్యకర్తల ఉద్యమం. మన నాయకుడు అవమానించబడిన అదే శాసన సభలో ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నది మా సంకల్పం.
మనసా – వాచా – కర్మణా పని చేస్తూ ఆ లక్ష్యాన్ని సాధించడమే మా గమ్యం.

🙏 మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి
Team TDP ఒక ఉద్యమం – అభిప్రాయం చెప్పగల శక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఓ వేదిక.
మీ సహాయం, సమయం, మద్దతు – ఇవన్నీ మాకు చాలా విలువైనవి.
బాబు గారి సేవలో… Team TDP – ఎప్పుడూ సిద్ధంగా!